న్యూస్‌రీల్
భయపడి.. ప్రాణంతీసుకుని..
బాసర ట్రిపుల్‌ఐటీలో ఈసీఈ(ఇంజినీరింగ్) ఫస్టియర్ చదువుతున్న వనపర్తి జిల్లా అన్నారంతండాకు చెందిన రాత్లావత్ వసంత (19) ఈ ఏడాది ఫిబ్రవరి 25న హాస్టల్ గదిలోనే ఉరేసుకుంది. వరుసకు మేనత్త కుమారుడైన గణ్యనాయక్ తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో ఇప్పట్లో పెళ్లి కుదరదని, చదువు పూర్తి కావాలని చెప్పింది. దీంతో మనస్తాపంతో సదరు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న వసంత ఆత్మహత్య చేసుకుంది. భయంతోనే ఆత్మహత్య చేసుకుందని అప్పట్లో కుటుంబసభ్యులు, పోలీసులు పేర్కొన్నారు.
డబ్బు పోయిందని జీవితం బలి..
బాసర ట్రిపుల్‌ఐటీలోనే ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన సంపత్ (19) తన దగ్గర జమ చేసుకున్న చిన్నమొత్తంతో అమ్మకు ఏదైనా బంగారు నగను చేయించాలని ఆశపడ్డాడు. టెలిగ్రామ్ యాప్‌లో వచ్చిన ఓ గోల్డ్ స్కీమ్‌లో డబ్బులు పెట్టి మోసపోయాడు. అమ్మకు, తన కుటుంబానికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలనే వేదనలో ఈ నెల 24న ఆత్మహత్య చేసుకున్నాడు. ఉజ్వల భవితతో కుటుంబానికి అండగా నిలవాల్సినవాడు కన్నీటిసంద్రంలో ముంచేశాడు.
నాన్ టీచింగ్ ఉద్యోగుల నిరసన
బాసర: తమ సమస్యలు పరిష్కరించాలని బాసర ఆర్జీయూకేటీలో పనిచేస్తున్న బోధనేతర (నాన్‌టీచింగ్) ఉద్యోగులు బుధవారం అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు శ్యాంబా బు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం స్థాపించినప్పటి నుంచి చాలీచాలని వేతనాలతో ఉద్యోగులు సేవలందిస్తున్నారని, నేటికీ వారి కి ఉద్యోగ భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, మినిమం టైమ్ స్కేల్ అమలుతో పాటు వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షురాలు డాక్టర్ అరుణ జ్యోతి, సభ్యులు రవివర్మ, దస్తగిరి, శైలజ, శ్వేత, తదితరులు పాల్గొన్నారు.
ఎంతటి కారణమైనా.. ప్రాణం ముందు అది చిన్నదే. కానీ.. చిన్నచిన్న కారణాలకే పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారు. తిరిగిరాదని తెలిసినా.. తమ చేతులతోనే ప్రాణం తీసుకుంటున్నారు. క్షణికావేశంలో వేసే అడుగు.. వారి నిండు జీవితాన్నే అర్ధాంతరంగా ముగిస్తోంది. ఈ మధ్యకాలంలో జిల్లాలో కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక ఇబ్బందులు, పరీక్షల్లో వైఫల్యాలు, అప్పుల బాధలు.. ఇలా చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. సమస్య వచ్చినప్పుడు దాని నుంచి బయటపడే మార్గాలను వెతకాల్సింది పోయి.. జీవితాన్నే అంతం చేసుకుంటున్నారు. తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుస్తున్నారు. – నిర్మల్
నేలరాలిన మరో విద్యాకుసుమం..
చదువులో మేటిగా ఉంటేనే బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు దక్కుతుంది. చదువులమ్మ చెంతనే చదువును పూర్తి చేసుకుని, అక్కడి నుంచే నేరుగా ఉద్యోగాన్ని పొంది జీవితంలో ఉన్నతంగా స్థిరపడొచ్చు. ఇంతటి అదృష్టం కొందరికే దక్కుతోంది. కానీ.. అందులో పలువురు విద్యార్థులు తీసుకుంటున్న నిర్ణయాలు వారి బంగారు జీవితాలను మధ్యలోనే ముగిస్తున్నాయి. చదువుల క్షేత్రంలో మొన్న మరో విద్యాకుసుమం సంపత్ బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచివేసింది. చిన్నపాటి సమస్యలకు ఉత్తమ భవిష్యత్ ఉన్న విద్యార్థులు ఇలా ఆత్మహత్యల వరకు వెళ్లడం సమాజం మొత్తాన్ని బాధిస్తోంది.
క్షణికావేశం.. శాశ్వత విషాదం
జీవితంలో సమస్యలు సహజం. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో కష్టాలు, ఒత్తిళ్లు, నిరాశలు ఎదురవుతుంటాయి. ఆ క్షణంలో, సందర్భంలో ఎదురైన సమస్యే జీవితమంతా కొనసాగుతుందని భావించ డం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం ఆత్మహత్యలకు దారితీస్తోంది. మొత్తం కుటుంబాన్ని జీవి తాంతం కన్నీటిలో ముంచుతోంది. సమస్యకు పరి ష్కారం దొరకకపోవచ్చు.. కానీ ప్రాణం కోల్పోతే మాత్రం తిరిగి పొందలేమనే విషయాన్ని విస్మరి స్తూ.. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఇటీవల జిల్లాలో సగటున వారానికో ఆత్మహత్య నమోదవుతోంది. ఇందులోనూ యువత, మధ్యవయస్కులే ఎక్కువగా ఉంటుండటం కలవరపెడుతోంది.
బాధాకరమైన విషయం..
ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న విద్యార్థులు అర్ధాంతరంగా తనువు చాలించడం చాలా బాధకరమైన విషయం. ట్రిపుల్‌ఐటీ ఘటన కలచివేసింది. చిన్నపాటి కారణాలకే ఇలా ప్రాణాలు తీసుకోవద్దు. ఎంతటి సమస్యకై నా పరిష్కారం ఉంటుంది. – జానకీషర్మిల, ఎస్పీ
మానసిక ఇబ్బందులతోనే..
కుటుంబ, ఆర్థిక పరిస్థితులు, ఒంటరితనం, ఆత్మన్యూనతభావం, మత్తుపదార్థాలు ఇలాంటివే ఎక్కువగా విద్యార్థులు, యువతను ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తుంటాయి. ఇలాంటి సమస్యలున్న వారికి సకాలంలో సరైన కౌన్సెలింగ్ ఇస్తే మళ్లీ మాములుగా మారుతారు.
– ప్రొఫెసర్ డా.విశాల్, న్యూరోసైకియాట్రిస్ట్
ఆత్మహత్య పరిష్కారం కాదు..
విద్యార్థి దశలోనే తమ బంగారు జీవితాలను బలితీసుకోవడం బాధాకరం. ఇది సమాజానికి మంచిది కాదు. ఏ సమస్యకై నా ఆత్మహత్య పరిష్కారం కాదు. ఎంతటి ఇబ్బందికై నా ఏదో ఒక దారి ఉంటుంది. క్షణికావేశంలో ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు.
– సీపెల్లి రవి, జిల్లా కోఆర్డినేటర్, జననీ జన్మభూమి ఆత్మహత్యల నివారణ కమిటీ
బాసర ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి


