బస్టాండ్లలో మూడో కన్ను | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్లలో మూడో కన్ను

Nov 12 2026 12:07 AM | Updated on Nov 12 2026 12:07 AM

● సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు ● బస్‌భవన్‌ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం ● ప్రాంగణాల్లో పెరగనున్న భద్రత

మంచిర్యాలఅర్బన్‌: బస్టాండ్లలో ప్రయాణికుల భ ద్రతపై ఆర్టీసీ యాజమాన్యం విప్లవాత్మక మార్పుల కు శ్రీకారం చుడుతోంది. డిపోలు, బస్టాండ్లలో నేరా లు, చోరీలు, వేధింపులు అరికట్టడంతోపాటు ప్ర యాణికుల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణకు స రికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ప్రధాన బస్టాండ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయించింది. వా టిని నేరుగా హైదరాబాద్‌ ఆర్టీసీ ప్రధాన కార్యాల యం బస్‌భవన్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించడం ద్వారా నిఘా వ్యవస్థ పటిష్టం కానుంది. కొన్నిచోట్ల స్థానికంగా డిపో అధికారులు, మరికొన్ని చోట్ల పోలీసుశాఖ కంట్రోల్‌ రూమ్‌లు ప ర్యవేక్షిస్తుండగా బస్‌భవన్‌తో అనుసంధానంతో అ త్యున్నతస్థాయి నిఘా అందుబాటులోకి రానుంది.

కేంద్రీకృత పర్యవేక్షణ

రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లలో జరిగే పరిణామాలను హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఉన్నతాధికారులు 24గంటలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. పండుగలు, జాతరలు, అత్యవసర సమయాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగితే అధికారులకు వెంటనే సమాచారం తెలియనుంది. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు కేటాయించేందుకు నిమిషాల వ్యవధిలో నిర్ణయాలు తీసుకోవచ్చు.

భద్రతపై నిరంతర నిఘా

సీసీ టీవీ కెమెరా ఏర్పాటుతో భద్రతపై నిరంతర నిఘా సాగనుంది. మహిళలపై ఆకతాయిల వేధింపులు, జేబు దొంగతనాలు, అనుమానాస్పద వ్యక్తు ల సంచారాన్ని బస్‌ భవన్‌ నుంచి కంట్రోల్‌ రూం సిబ్బంది ఎప్పటికప్పుడు గుర్తిస్తూ స్థానిక అధికారులను అప్రమత్తం చేయవచ్చు. పారిశుద్ధ్యం, విచారణ కౌంటర్లు, ఫ్లాట్‌ఫారాలపై బస్సుల వేళలు, సిబ్బంది ప్రయాణికులకు అందించే సేవల తీరును ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు.

అత్యాధునిక కెమెరాల ఏర్పాటుపై దృష్టి

ఆర్టీసీ బస్టాండ్లలో కొత్త సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నిర్మల్‌ డిపోలో 35, ఆసిఫాబాద్‌లో 10, మిగతా డి పోల్లోనూ కెమెరాల ఏర్పాటుపై వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. డిపో ప్రాంగణం, బస్‌స్టేషన్లు, ఫ్లాట్‌పాంలు, ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, టికెట్‌ కౌంటర్లు, బస్‌డిపో ప్రాంగణాల్లో మరిన్ని కొత్త హె చ్‌డీసీసీ కెమెరాలను త్వరలోనే అమర్చనున్నారు. బస్‌ భవన్‌లో సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, పోలీస్‌స్టేషన్‌, డిపో కార్యాలయాలకు లైవ్‌ఫీడ్‌ యా క్సెస్‌ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

మంచిర్యాల బస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement