8లోu
న్యూస్‌రీల్
తాగునీరు కలుషితం..
హాస్టళ్లకు మురుగునీరు..
నాసిరకంగా భోజనం..
అధ్యాపకుల కొరత..
మంత్రి జోక్యానికి విద్యార్థుల డిమాండ్
బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్
నిర్మల్
తహసీల్దార్
కార్యాలయం తనిఖీ
తానూరు: ముధోల్ తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ డి.వెంకటమాధవరావు మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు, ఫైళ్లు క్షుణ్ణంగా పరిశీలించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన రికార్డుల నిర్వాహణ, పెండింగ్ దరఖాస్తులు, ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో జరుగుతున్న భూ సర్వేల వివరాలు ఆరాతీశారు. ప్రజలు తమ భూసమస్యలు, ఇతర రెవెన్యూ సంబంధిత పనుల కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి ఇబ్బందులు కలగకుండా సత్వర సేవలు అందించాలని తెలిపారు. అనంతరం కార్యాలయంలో ఉన్న రికార్డుల గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీలత, డిప్యూటీ తహసీల్దార్ తెలంగ రావు, ఆర్‌ఐ సత్యనారాయణ, ఉన్నారు.
భైంసా: గ్రామీణ పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) బాసరలో మళ్లీ ట్రబుల్స్ మొదలయ్యాయి. సమస్యలు విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతున్నాయి. సుమారు 9 వేల మంది విద్యార్థులు చదువుతున్న ఈ యూనివర్సిటీలో తాగునీరు, ఆహారం, వైద్యం, అధ్యాపకుల కొరత, హాస్టళ్ల నిర్వహణ, పరిపాలనా జవాబుదారీతనం వంటి అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇటీవల నీటి కొరత కారణంగా దసరా సెలవులు పొడిగించి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాల్సి వచ్చింది. తాజాగా హాస్టళ్లలోని కుళాయిల నుంచి మురుగు నీరు వస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 18 ప్రధాన సమస్యలను మంత్రి డి.శ్రీధర్‌బాబు మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు.
చెరువు ఉన్నా నిర్వహణ లోపం..
క్యాంపస్‌లో సుమారు 24 ఎకరాల విస్తీర్ణంలో నీటి నిల్వ చెరువు ఉన్నప్పటికీ దాని నిర్వహణ, శుభ్రత, నీటి నిల్వ సామర్థ్యంపై తగిన పర్యవేక్షణ లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో నీటి నిల్వలు ఎంత ఉన్నాయి? వర్షపు నీటిని ఎంతమేరకు నిల్వ చేస్తున్నారు? అవసరమైన సమయంలో వినియోగించుకునేలా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించడం లేదని పేర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న జలవనరులను ముందుగానే అభివృద్ధి చేసి నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
19 మందే శాశ్వత అధ్యాపకులు..
వర్సిటీలో సుమారు 9 వేల మంది విద్యార్థులకు కేవలం 19 మంది శాశ్వత అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారని, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు లేరని పేర్కొంటున్నారు. అధ్యాపకుల కొరత కారణంగా కొన్ని సబ్జెక్టులకు ఎన్‌పీటీఈఎల్ ఆన్‌లైన్ కోర్సులపై ఆధారపడాల్సి వస్తోందని, ప్రత్యక్ష బోధన, సందేహ నివృత్తి, వ్యక్తిగత మార్గదర్శకత్వం లోపిస్తున్నాయని చెబుతున్నారు. శాశ్వత అధ్యాపకులను నియమించి ప్రయోగశాలలను ఆధునీకరించి, సాంకేతిక పరికరాలు, ల్యాప్‌టాప్‌లు, గ్రంథాలయ వనరులు అందించాలని కోరుతున్నారు.
స్కాలర్‌షిప్ జాప్యం..
టీఎస్ ఈపాస్ ద్వారా రావాల్సిన ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్, మెయింటనెన్స్ ఫీజుల విడుదలలో జాప్యం విద్యార్థులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ బకాయిలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ విద్యార్థులు సొంతంగా ఫీజులు చెల్లించే వరకు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై స్పష్టమైన విధానం తీసుకురావాలని కోరుతున్నారు.
వైద్యం, క్రీడలు, వసతుల అభివృద్ధి
విశ్వవిద్యాలయంలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా పూర్తిస్థాయి వైద్య కేంద్రం, అర్హత కలిగిన వైద్యులు, సిబ్బంది, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. మెస్‌లలో ఆహార నా ణ్యత, పరిశుభ్రతపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్‌సీసీ అవకాశాలు కల్పించడం, శాతవాహన గ్రౌండ్‌ను శుభ్రపరిచి విస్తరించడం, పారిశుద్ధ్యం మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.
విజ్ఞానానికి కొత్త లైబ్రరీలు
పాఠశాలలో మంటలు
లక్ష్మణచాంద మండలం వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనం వంట చేసే సమయంలో మంటలు చెలరేగాయి.
ప్రశ్నిస్తే వేధింపులు?
కనీస సదుపాయాలపై ప్రశ్నించే విద్యార్థులను కొందరు అధికారులు బెదిరిస్తున్నారని, ఫోన్లను అనుమతి లేకుండా తీసుకుంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సమస్యలను లేవనెత్తే వారిపై తప్పుడు ఫిర్యాదులు చేయడం, వివక్ష చూపడం, ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయని చెబుతున్నారు. ఓఎస్‌డీ సహా కొంతమంది అధికారుల వ్యవహారశైలిపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని కోరుతున్నారు. విద్యార్థుల సమస్యలను వినేందుకు స్వతంత్ర ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయడంతోపాటు ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థి ప్రతినిధి సంఘానికి గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
18 అంశాలతో వినతిపత్రం
సీఎం క్షమాపణ చెప్పాలి
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే తెలంగాణ ప్రజా కోర్టులో శిక్ష తప్పదని బీజేపీ రాష్ట్ర నాయకుడు రావుల రాంనాథ్ హెచ్చరించారు. నిర్మల్‌లో మంగళవారం మాట్లాడారు. సోమవారం కొ డంగల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బ హిరంగ సభలో సీఎం మాట్లాడుతూ ప్రధానిని కించపరిచేలా మాట్లాడటాన్ని ఖండించారు. గతంలో కేసీఆర్ కూడా ఇదే రీతిలో నరేంద్రమోదీపై పరుష పదజాలంతో మాట్లాడి ఈరోజు ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి కూడా తన భాషను మార్చుకోకపోతే కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఎ న్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్ర జలు ఎక్కడ ప్రశ్నిస్తారోననే భయంతోనే రేవంత్‌రెడ్డి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసి మాట్లాడితే తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
మంత్రి జోక్యంపై ఆశలు
విద్యార్థుల ప్రధాన డిమాండ్లలో వేధింపుల ఆరో పణలపై విచారణ, ఫిర్యాదుదారులకు రక్షణ, సురక్షిత తాగునీరు, నాణ్యమైన ఆహారం, వైద్య సదుపాయాలు, అధ్యాపకుల నియామకాలు, స్కాలర్‌షిప్‌ల విడుదల, విద్యార్థి ప్రతినిధి సంఘానికి గుర్తింపు, ప్రత్యేక నిధులతో క్యాంపస్ అభివృద్ధి ఉన్నాయి. 18 అంశాలపై నిర్దిష్ట కాలపరిమితితో కార్యాచరణ ప్రణాళిక రూపొందించా లని కోరుతున్నారు. తాము పరిపాలనకు వ్యతిరేకులు కాదని, వర్సిటీ అభివృద్ధి కోసమే సమస్యలు ప్రస్తావిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.


