తానూరు: భూగర్భ జలాలను పెంచేందుకు బోర్వెల్ రీచార్జి చేసుకోవాలని ఏపీడీ నాగార్జున్ అన్నారు. ముధోల్ మండలం ఆష్ట గ్రామంలో సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ చేపట్టిన పశువుల తొట్టి, పంటకుంట, బోర్వెల్ రీచార్జి పనులను మంగళవారం పరిశీలించి మాట్లాడారు. బోర్వెల్ రీచార్జి ద్వారా వర్షపు నీటిని శాసీ్త్రయ పద్ధతిలో భూగర్భంలోకి పంపి జలాల నిల్వలు పెంచే అవకాశం ఉంటుందన్నారు. వీబీజీ రాంజీ పథకంలో భాగంగా గ్రామపంచాయతీల అవసరాలకు అనుగుణంగా నీటి సంరక్షణ పనులు ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలన్నారు. ఖాళీ భూముల్లో పశువులకు అవసరమైన మేత కోసం విత్తనాలను అందిస్తున్నట్లు తెలిపారు. పుష్కర ఘాట్లు, పొలాలకు రహదారులు, గ్రామాభివృద్ధి పనులను సర్పంచ్ ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మహిళ సమాక్య భవనానికి మార్కింగ్ చేశారు. కార్యక్రమంలో హార్టికల్చర్ ఏడీ రమణ, ఏపీవో శిరీష, ఐకేపీ ఏపీఎం గురుచరణ్, సీసీ గంగారెడ్డి, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, యోగేష్, రాజేశ్వర్ పాల్గొన్నారు.


