లక్ష్మణచాంద: మండలంలోని చామన్పల్లిలో ఎల్లమ్మకు మంగళవారం బోనాలు సమర్పించారు. అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ పండుగను నిర్వహించారు. మహిళలు బోనాలతో ముందుగా రామాలయం వద్దకు చేరుకుని పూజలు చేశారు. అనంతరం ప్రధాన వీధులగుండా ఊరేగింపుగా బోనాలతో ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఊరేగింపులో పోతురాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇందులో సర్పంచ్ లక్ష్మీ సుదర్శన్, ఉప సర్పంచ్ గంగారెడ్డి, సంఘం సభ్యులు రాజేందర్, శ్రీనివాస్, సురేశ్, మధు, సాయన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


