ఎల్‌నినోను తట్టుకునేలా ఆయిల్‌పామ్‌ సాగు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోను తట్టుకునేలా ఆయిల్‌పామ్‌ సాగు

Oct 30 2026 12:03 AM | Updated on Oct 30 2026 12:03 AM

ముధోల్‌: ఎల్‌నినో ప్రభావంతో ఆయిల్‌పామ్‌ పంటపై ప్రతికూల ప్రభావాలను తగ్గించి మొక్కలు నీటి ఎద్దడి నుంచి కాపాడేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భైంసా డివిజన్‌ ఉద్యాన అధికారి షేక్‌ జావిద్‌ పాషా సూచించారు. ముధోల్‌ రైతు వేదికలో గురువారం ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్‌ సాగులో ఎల్‌నినో ప్రభావం, నివారణ చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మొక్కలకు తగినంత నీటిని అందించడంతోపాటు సిఫార్సు చేసిన మొతాదులో ఎరువులను వినియోగించాలని తెలిపారు. పొటాష్‌ ఎరువుల వాడకంపై శాసీ్త్రయ సూచనలు పాటించడం ద్వారా నీటి కొరతతో కలిగే ఇబ్బందులను కొంత వరకు తగ్గించవచ్చని వివరించారు. మొక్కల్లో 30 నుండి 35 ఆకులు ఉండేలా యాజమా న్య చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంట యాజమాన్య పద్ధతులను పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త దినేష్‌, మండల వ్యవసాయ అధికారి రచన, ఏఈవో రాణి, ఉద్యాన విస్తరణ అధికారి మోయిన్‌ మియా, ఆయిల్‌పామ్‌ కంపెనీ ప్రతినిధులు, ముధోల్‌, తానూర్‌, బాసర మండలాల రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement