కుంటాల: జిల్లా కేంద్రంలో ఈనెల 28న పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు నమూనా పార్లమెంట్ నిర్వహణ పోటీలు నిర్వహించా రు. కుంటాల ఆదర్శ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని శిలా వైష్ణవి నమూనా పార్లమెంటు నిర్వహణలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలిగా ప్రతిభ కనబర్చి ఉమ్మడి జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లిష్ స్పెషల్ బీలో 10వ తరగతి విద్యార్థి మేసినేని కార్తికేయ మూడో స్థానంలో నిలిచా డు. ఇద్దరూ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని గైడ్‌టీచర్ నరేశ్‌కుమార్ తెలిపారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు, నవీన్‌గౌడ్ అభినందించారు.
మేసినేని కార్తికేయ


