నిర్మల్టౌన్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ పట్టణ పోలీ స్ స్టేషన్లో గురువారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. విన్నర్స్ హైస్కూల్, దీక్ష జూనియ ర్ కళాశాల విద్యార్థులు ఠాణాను సందర్శించారు. వీరికి డీఎస్పీ శ్రీనివాస్ పోలీసుల విధులు, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతపై వి ద్యార్థులకు అవగాహన కల్పించారు. వివిధ రకాల ఆయుధాలు, బాంబులను గుర్తించే ప రికరాలను తెలియజేశారు. పోలీస్ కంట్రోల్ రూంలో సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా, డయల్ 100 సేవల గురించి విద్యార్థులు తెలుసుకున్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ సమ్మయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


