2025, ఏప్రిల్ 10 రాత్రి 11.30 గంటలకు ఎస్‌బీ ఎస్సై నాకు ఫోన్ చేశాడు. మామడ మండలం కప్పన్‌పల్లి గ్రామానికి చెందిన రాజుల రాధ, గట్టుమీది లక్ష్మి, కంబాల లింగవ్వ, బత్తుల సరోజ తునికాకు సేకరణకు వెళ్లి తిరిగి రాలేదని చెప్పాడు. సమాచారం అందిన క్షణం అలర్ట్ అయ్యాం. ఏప్రిల్ 11న వేకువజామునే నేరుగా కప్పన్‌పల్లి వెళ్లాను. మా వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో గ్రామస్తుల ట్రాక్టర్లను తెప్పించి వారితోనే కలిసి అడవి లోపలికి వెళ్లా. కొన్నిగంటల తర్వాత నలుగురు మహిళలను క్షేమంగా తీసుకువచ్చాం. ఈ ఘటన ఎప్పటికీ గుర్తుంటుంది. – జానకీషర్మిల, ఎస్పీ


