ఇంటర్ విద్యార్థిని..
తలమడుగు: తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీ సులు తెలిపిన ప్రకారం మండలంలోని అర్లీ గ్రామానికి చెందిన కొండ్ర దీపిక (16) ఆదిలాబాద్‌లోని బంగారుగూడ మహాత్మ జ్యోతిబాపూలే కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంది. ఇటీవల దసరా సెలవుల కో సం ఇంటికి వచ్చింది. పని విషయంలో తండ్రి సతీ శ్ మందలించడంతో మంగళవారం రాత్రి ఇంట్లోనే దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు.


