నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సోమవారం జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. సమగ్ర శిక్ష ఎఫ్‌ఏవో సిద్ధ పద్మ, జిల్లా విలీన విద్య సమన్వయకర్త ప్రవీణ్ కుమార్ మాట్లాడు తూ.. ప్రత్యేక అవసరాల విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను, పట్టుదలను, జట్టుగా పనిచేసే సామర్థ్యాన్ని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు అవకాశం లభిస్తుందని వివరించారు. అనంత రం విద్యార్థులకు క్యారం, చెస్ తదితర పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.


