నీటి వృథా.. | - | Sakshi
Sakshi News home page

నీటి వృథా..

Oct 26 2026 12:04 AM | Updated on Oct 26 2026 12:04 AM

● లీకేజీలతో రోడ్లపాలవుతున్న తాగునీరు ● ఎల్‌నినో నేపథ్యంలో పొదుపు అవసరం

అరికట్టకుంటే తప్పదు వ్యథ!

నిర్మల్‌టౌన్‌: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాగునీటిని పొదుపుగా వినియోగించాలని సూచిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా నీటిని వృథా చేయొద్దని సూచించారు. కానీ జిల్లాలోని నిర్మల్‌, భైంసా మున్సిపాలిటీల్లో మాత్రం పైపులైన్‌ లీకేజీలతో తాగునీరు వృథా అవుతోంది. నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిర్మల్‌లో ఇలా..

నిర్మల్‌ పట్టణంలో ప్రతిరోజూ సుమారు 19.40 ఎంఎల్‌డీ (194 లక్షల లీటర్లు) తాగునీరు సరఫరా అ వుతోంది. దాదాపు 21,800 నల్లా కనెక్షన్లు ఉన్నా యి. ఇంత పరిమాణంలో సరఫరా జరుగుతున్నా, పలు ప్రాంతాల్లో భూగర్భ పైప్‌లైన్ల నుంచి నీరు లీకై రోడ్లపైకి వస్తోంది. పబ్లిక్‌ కుళాయిలకు ఆన్‌–ఆఫ్‌ వాల్వ్‌లు లేకపోవడంతో సరఫరా సమయంలో నీ రు డ్రెయినేజీలపాలవుతోంది. లీకేజీలను సకా లంలో గుర్తించి మరమ్మతు చేయకపోవడంతో న ష్టం పెరుగుతోందని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పర్యవేక్షణ లోపం..

వివిధ వార్డుల్లో ఇలాంటి సమస్యలు కొనసాగుతున్నాయి. లీకేజీలను వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టడంతోపాటు పబ్లిక్‌ కుళాయిలకు వాల్వ్‌లు ఏర్పాటు చేస్తే వృథాను గణనీయంగా తగ్గించవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయినా సమర్థవంతమైన చర్యలు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

భైంసాలో లక్ష లీటర్లు వృథా..

భైంసాటౌన్‌: భైంసా పట్టణంలో ఇంకా చాలామంది ఎల్‌నినో పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదు. ప్రతీరోజు విలువైన నీటిని వృథా చేస్తున్నా రు. ముఖ్యంగా లీకేజీలు, నల్లా కనెక్షన్లకు వద్ద ఆన్‌ ఆఫ్‌ లేక చాలావరకు నీరు వృథాగా పోతోంది. పట్టణంలో 13,300 నల్లా కనెక్షన్లు ఉండగా, మిషన్‌ భగీరథ ద్వారా పట్టణ ప్రజలకు తాగునీటి ని సరఫరా చేస్తున్నారు. ప్రతీరోజు 12 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తుండగా, చాలావరకు నల్లా కనెక్షన్లకు ఆన్‌/ఆఫ్‌ లేకపోవడంతో రోజుకు లక్ష లీటర్ల వరకు నీరు వృథాగా పోతోంది. ముఖ్యంగా స్లమ్‌ కాలనీల్లో నల్లాలకు ఆన్‌/ఆఫ్‌లు లేవు. దీంతో దాదాపు గంటపాటు నీటిని వదులుతుండగా, అవసరం మేరకు నీటిని వాడుకుని మిగిలి న నీటిని వృథాగా పోనిస్తున్నారు. ఇంట్లో నల్లాల కు ఆన్‌/ఆఫ్‌ లేకపోతే వెంటనే బిగించుకుంటాం. అలాంటిది పబ్లిక్‌ నల్లాయే కదా అని నిర్లక్ష్యంగా వదిలేస్తుండడంతో విలువైన నీరు వృథాగా పో తోంది. ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా నీటిని సంరక్షించాల్సిన అవసరముందని అధికారులు చెబుతున్నారు. నల్లాల కు ఆన్‌/ఆఫ్‌ లేకపోతే అలాంటి కనెక్షన్లను తొలగి స్తామని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు.

వేసవికి ముందు జాగ్రత్తలు

వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రాను న్న వేసవిలో తాగునీటి సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. మున్సిపల్‌ అధికారులు ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలి. సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ, లీకేజీలకు తక్షణ మరమ్మతులు, పబ్లిక్‌ కుళాయిలకు వాల్వ్‌ల ఏర్పాటు, ప్రజలకు పొదుపు అవగాహన కల్పించడం అవసరమని పట్టణవాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement