కెరమెరి: ఆదివాసీ ముద్దు బిడ్డ కుమురంభీం 86వ వర్ధంతికి కెరమెరి మండలంలోని జోడేఘా ట్ ముస్తాబైంది. భీం విగ్రహంతోపాటు మ్యూజి యం, జెండాలను అందంగా తీర్చిదిద్దారు. ప్రజల కోసం టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖుల కోసం హెలిప్యాడ్ సిద్ధం చేశారు. గిరిజన సంప్రదాయం ప్రకారం సోమవారం ఉదయం 8 గంటలకు జెండాలు ఆవిష్కరించనున్నారు. 9 గంటలకు సమాధి వద్ద పూజలు చేసి 10 గంటలకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. మధ్యాహ్నం గిరిజనులతో ప్రత్యేక దర్బార్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివా సీలు హాజరు కానున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యక్తిగత కా రణాలతో హాజరుకావడం లేదని తెలుస్తోంది.
హాజరుకానున్న ప్రముఖులు..
రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తోపాటు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.హరిత, ఐటీడీఏ పీవో మంద మకరందు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సీతక్క బేగంపేట నుంచి ఉదయం బ యలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు జోడేఘా ట్ చేరుకోనున్నారు. అలాగే మరో మంత్రి అడ్లూ రి లక్ష్మణ్ ఉదయం 8 గంటలకు జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి నుంచి 11 గంటలకు జోడేఘాట్‌కు వస్తారు. వీరు దర్బార్‌తోపాటు ఇతర కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొననున్నారు.
12 వేల మంది అంచనా..
వర్ధంతికి 12 వేల మందికి పైగా హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆసిఫాబాద్ డిపో నుంచి పది ప్రత్యేక బస్సులు నడపనున్నారు. హట్టి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ప్రత్యేకంగా వచ్చే ప్రైవేట్ వాహనాలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. 20 వేల మంది వరకు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
జల్, జంగల్, జమీన్ అర్చీలు


