సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మ దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాతోపాటు నిజమాబాద్, హైదరా బాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నా రు. ఉదయం 5 గంటల నుంచే ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో హారతీ, అభిషేకం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈవో భూమయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ముధోల్‌లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి
ముథోల్: నియోజకవర్గ కేంద్రమైన ముధోల్‌లో మినీ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రామారావుపటేల్ అన్నారు. ముధోల్ జెడ్పీహెచ్‌ఎస్ మైదానంలో ఆదివారం నిర్వహించిన ఫ్రెండ్షిప్ క్రికెట్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలని అన్నారు. ముధోల్‌లో మినీ స్టేడియానికి అనుకూలమైన స్థలం ఉందని, త్వరలో స్టేడియం మంజూరు చేయిస్తానన్నారు. భైంసా మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి మాట్లాడుతూ ముధోల్ మైదానంలో తాను క్రికెట్ ఆడిన అనుభూతులను గుర్తుకు చేసుకున్నారు. ముధోల్, భైంసాలో కులమతాలకు అతీతంగా క్రీడ స్ఫూర్తిని కలిగి ఉండి క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారని పేర్కొన్నారు. ఫ్రెండ్‌షిప్ క్రికెట్ టోర్నమెంట్‌లో మొదటి బహుమతిగా టెక్నో ముధోల్ రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా సర్పంచ్ 11 ధర్మాబాద్ జట్టుకు రూ.15 వేలతోపాటు బహుమతులు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ముధోల్, అష్ట సర్పంచులు ఏజాజుద్దీన్, రావుల శ్రీనివాస్, కాంగ్రెస్, బీజేపీ మండల అధ్యక్షులు సాపేవార్ కిష్టయ్య, కోరి పోతన్న, ఎస్సై బిట్ల పెర్సిస్, ఈవో అన్వర్ అలీ, నాయకులు తాటివార్ రమేశ్, పట్టెపురం సతీశ్‌రెడ్డి, ఇమ్రాన్‌ఖాన్, జీవన్, శ్రీనివాస్, మగ్దమ్, నిర్వాహకులు విష్ణు, అఫ్రోజ్, మేరాజ్‌ఖాన్, దాదా, సికిందర్ తదితరులు పాల్గొన్నారు.


