నిర్మల్‌రూరల్: తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లు అప్పగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్–కౌట్ల(కే) శివారులో లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్ శివారులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిందన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు లక్కీ డ్రా ద్వారా ఆర్డీవో సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేసినా ఇప్పటికీ ఇళ్లను కేటాయించలేదన్నారు. సోమవారం లోపు తమకు న్యాయం జరగకుంటే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని స్పష్టం చేశారు.


