నిర్మల్ టౌన్: పోలీస్ విధి నిర్వహణలో ఆయుధాలు, వాహనాలు కీలకమని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. దసరా నవరాత్రుల్లో భాగంగా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఆయుధపూజ నిర్వహించారు. పోలీస్ ఆయుధాలకు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. హెడ్‌క్వార్టర్స్ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటా రు. దసరా పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి తీసుకురావాలని ఆకాంక్షించారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వెట్టిచాకిరీ నిర్మూలనకు
కృషి చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: వెట్టిచాకిరీ నిర్మూలనకు అధికా రులు సమన్వయంతో కృషి చేయాలని, కార్మికుల హక్కులు, చట్టాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు.వెట్టిచాకిరీ నిర్మూలన, కార్మికుల హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘స్వేచ్ఛా రథం’ ప్ర చార వాహనాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. వెట్టిచాకిరీతో కలిగే అనర్థాలు, దాని నిర్మూలనకు ఉన్న చట్టాలు, కార్మికులకు కల్పించిన హక్కులపై నాటికలు, పాటల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. వెట్టిచాకిరీకి గురైనవారు, అలాంటి ఘటనలను గుర్తించిన వారు టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 080–69434343 లో సంప్రదించాలని సూచించారు. అనంతరం గోడప్రతులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేశ్, వెంకట మాధవరావు, కార్మిక శాఖ అధికారి రాజలింగం, ప్రచార రథం సిబ్బంది పాల్గొన్నారు.


