కలెక్టర్‌ను కలిసిన కుమురంభీం మనుమడు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను కలిసిన కుమురంభీం మనుమడు

Oct 20 2026 4:37 AM | Updated on Oct 20 2026 4:37 AM

ఆదిలాబాద్‌టౌన్‌: తెలంగాణ సంస్కృతికి ప్ర తీక బతుకమ్మ వేడుకలను సోమవారం జిల్లా జైలులో ఘనంగా నిర్వహించారు. మహిళా ఖైదీలు తమ పిల్లలతో కలిసి జైలు ఆవరణలో రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి, సాంప్రదాయబద్ధంగా పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులు సై తం బతుకమ్మల పక్కన కూర్చొని వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో జైలులో పండుగ సందడి నెలకొంది. జైలు సూ పరింటెండెంట్‌ గోపిరెడ్డి, అధికారులు సూర్యప్రకాశ్‌ రెడ్డి, చంద్రశేఖర్‌, జైలు సిబ్బంది, మహిళా వార్డర్లు, మహిళా ఖైదీలు పాల్గొన్నారు.

కై లాస్‌నగర్‌: గిరిజన పోరాట యోధుడు కొమురంభీం మనుమడు కొమురం సోనేరావు సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలిసి శాలువాతో సత్కరించారు. ఆసిఫాబాద్‌ జిల్లా జోడేఘాట్‌లో ఈ నెల 26న నిర్వహించనున్న కొమురం భీం వర్ధంతి కార్యక్రమానికి రావాలని కోరుతూ ఆహ్వానపత్రికను అందజేశారు. అనంతరం కార్యక్రమ వాల్‌ పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు చిత్రు, రాజేశ్వర్‌, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా జైలులో

బతుకమ్మ వేడుకలు

పోచమ్మ ఆలయంలో చోరీ

తానూరు: మండలంలోని ఏల్వీ పోచమ్మ ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాయితో ఆలయం తాళాన్ని పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. 11 తులాల వెండి కిరీటం, రెండు తులాల వెండి తీగలు అపహరించినట్లు ఎస్సై షేక్‌ జుబేర్‌ తెలిపారు. సోమవారం ఉదయం క్లూస్‌టీం వేలి ముద్రలతోపాటు ఆధారాలు సేకరించారు.

అయ్యప్ప ఆలయంలో

హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు

తలమడుగు: సుంకిడి గ్రామంలోని అయ్యప్ప ఆలయంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఆలయ కమిటీ సభ్యుడు మల్లేష్‌ తెలిపిన వివరాల ప్ర కారం.. ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హుండీ ఎత్తుకెళ్లారు. ఉదయం గమనించిన భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న ఎస్సై రాధిక సీసీ కెమెరాలను పరిశీలించారు. హుండీలో దాదాపు రూ.15వేల వరకు ఉండొచ్చని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement