‘గిరిజన ఉద్యోగ సేతు’ సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘గిరిజన ఉద్యోగ సేతు’ సద్వినియోగం చేసుకోవాలి

Oct 20 2026 4:37 AM | Updated on Oct 20 2026 4:37 AM

● ఐటీడీఏ పీవో మంద మకరందు

ఉట్నూర్‌రూరల్‌: ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడే గిరిజన అభ్యర్థులకు సరైన సమాచారం, సమగ్ర ప్రణాళికను అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన గిరిజన ఉద్యోగ సేతు డిజిటల్‌ వేదికను యువత సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గిరిజన యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసి, ఉన్నత స్థానాల్లో నిలబెట్టడమే డిజిటల్‌ వేదిక ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, రైల్వేస్‌, బ్యాంకింగ్‌, వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల సమాచారం ఒకే వేదికపై అందుబాటులో ఉంటుందన్నారు. ఎస్టీ అభ్యర్థులకు వర్తించే రిజర్వేషన్లు, వయోపరిమితి సడలింపులు, ప్రభుత్వం అందించే ఉచిత శిక్షణ అవకాశాలు, స్కాలర్‌షిప్‌ల వివరాల ను నిబంధనల ప్రకారం వెబ్‌సైట్‌లో పొందుపర్చామని తెలిపారు. ఏజెన్సీ పరిధిలోని గ్రామీణ నిరుద్యోగ యువత, డిగ్రీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement