జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ)ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శనివారం రాత్రి బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అధికారికంగా ప్రారంభించారు. ప్రకృతిని, పూలను పూజించే అత్యున్నత సంస్కృతి మన తెలంగాణదని అన్నారు. జిల్లా ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య మాట్లాడుతూ సంప్రదాయాలను భావితరాలకు అందించాలన్నారు. – నిర్మల్ చైన్గేట్


