బందోబస్తుపై ప్రత్యేక శ్రద్ధ | - | Sakshi
Sakshi News home page

బందోబస్తుపై ప్రత్యేక శ్రద్ధ

Oct 18 2026 1:42 AM | Updated on Oct 18 2026 1:42 AM

● ఎస్సీ జానకీ శర్మిల

దిలావర్‌పూర్‌: అడెల్లి శ్రీమహాపోచమ్మ(గంగనీళ్ల)జాతర నేపథ్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. సాంగ్వి గ్రామంలోని పోచమ్మ ఆలయాన్ని, అన్నపూర్ణ దేవి ఆలయాన్ని శనివారం సందర్శించి పూజలు నిర్వహించారు. వీడీసీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, స్థానిక నాయకులు ఎస్పీ జానకీషర్మిలను సన్మానించారు. తర్వాత అమ్మవారి ఆభరణాలకు జలాభిషేకంచేసే గోదావరి తీరాన్ని ఎస్పీ పరిశీలించారు. తర్వాత బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులతో సమావేశమై సూచనలు అందజేశారు. ఆదివారం ఉదయం అమ్మవారి ఆభరణాలు అడెల్లి ఆలయానికి వెళ్లే మార్గంలో కంజర్‌, బన్సపల్లి, దిలావర్‌పూర్‌, మాడేగాం గ్రామాలతో పాటు, సారంగాపూర్‌ మండలంలోని ఆయా గ్రా మాల్లో పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు. భ క్తులకు ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలని సూచించారు. అమ్మవారి ఆభరణాలు తా కేందుకు, ఎత్తుకునేందుకు పోలీసులు ప్రయత్నించొ ద్దని తెలిపారు. సంప్రదాయాలను పాటిస్తూ భక్తుల కు అసౌకర్యం తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇందులో ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, నిర్మల్‌రూరల్‌ సీఐ కృష్ణ, దిలావర్‌పూర్‌ ఎస్సై రవీందర్‌, వివి ధ పోలీస్టేషన్ల ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement