దిలావర్పూర్: గ్రామీణ ప్రాంతంలో మహిళలు వ్య వసాయంలో పూర్తి సమయాన్ని కేటాయించి పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వ్యవసాయరంగంలో వారి పాత్రను చాటిచెబుతున్నారని ప్రకృతి వ్యవసాయ నిపుణుడు మన్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని కాల్వ గ్రామంలో గురువారం వ్యవసాయ రంగంలో మహిళల పాత్రను గుర్తిస్తూ, వారి కృషిని ప్రోత్సహించేలా మహిళా కిసాన్ దివస్ నిర్వహించారు. ఈసందర్భంగా మన్మోహన్రెడ్డి మాట్లాడుతూ భారత ప్రభుత్వం నిర్దేశించిన రోల్ ఆఫ్ విమెన్ ఫార్మర్ ఇన్ బిల్డింగ్ డెవలప్డ్ అగ్రికల్చర్(అభివృద్ధి చెందిన వ్యవసాయ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర) అనే అంశంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. వ్యవసాయ క్షేత్రంలో విశేషంగా కృషి చేస్తున్న మహిళా రైతులు, ప్రగతిశీల మహిళలు ఆధునిక వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలని వివరించారు. మహిళా రైతులు వ్యవసాయ రంగంలో సాధిస్తున్న విజయాలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇతర రైతులకు స్ఫూర్తిగా ని లుస్తాయని తెలిపారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ వ్యవసాయ అభివృద్ధిలో మహిళల పా త్రను మరింత విస్తృతం చేయడానికి మహిళా రైతులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా మహిళా రైతులకు జీవామృతాల తయారీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ బ్యాగరి రోజా, ఏవో రాజశేఖర్రెడ్డి, ఏఈవో జైపాల్, కృష్ణ, మహిళా రైతులు సౌజన్య, గోదావరి, రైతులు నర్సారెడ్డి, సాయన్న, నిమ్మల చిన్నయ్య, నాగరాజు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.


