చెరువుకు చేరని చేప | - | Sakshi
Sakshi News home page

చెరువుకు చేరని చేప

Oct 11 2026 11:43 PM | Updated on Oct 11 2026 11:43 PM

● ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ● ఎండల ప్రభావంతో తగ్గుతున్న నిల్వలు ● చేపపిల్లల విడుదలలోనూ తీవ్ర జాప్యం

సారంగపూర్‌: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిస్థాయిలో నిండలేదు. కొద్దిపాటి వర్షాలతో చేరిన నీటిని రైతులు వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. మత్స్యశా ఖ ఆధ్వర్యంలో చేపపిల్లల విడుదలకు టెండర్‌ ప్ర క్రియ పూర్తయింది. త్వరలో విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో విడుదల చేస్తే అవి ఎదగవని, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో విడుదల ప్రణాళిక

జిల్లాలో రిజర్వాయర్లు, చెరువులు కలిపి 562 ఉన్నాయి. ఈ ఏడాది 4,27,37,000 వేల చేపపిల్ల లు, రొయ్యలు విడుదల చేయాలని నిర్ణయించారు. శాశ్వతంగా నీరుండే రిజర్వాయర్లు, చిన్న ప్రాజెక్టుల్లో 80–100 మి.మీ. పరిమాణం, కాలానుగుణ చెరువులు, కుంటల్లో 35–40 మి.మీ. పరిమాణం చేపపిల్లల విడుదలకు కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందం కుదిరింది.

ఆలస్యం, నీటి కొరత..

ఏటా ఆగస్టు–సెప్టెంబర్‌లో విడుదల పూర్తి కావాలి. ఈ ఏడాది ఆలస్యంతోపాటు ఎండల తీవ్రత, వ్యవసాయ వినియోగంతో నీరు అడుగంటుతోంది. తక్కువ నీటిలో విడుదల చేస్తే చేపపిల్లలు బతకవని మత్స్యకారులు పేర్కొంటున్నారు. నవంబర్‌–డిసెంబర్‌లో వదిలితే చలి, ఎండల కారణంగా అరకిలో వరకే ఎదుగుతాయని అంటున్నారు. సీజనల్‌ చెరువులు, కుంటలు అధికంగా ఉండటంతో 35–40 మి.మీ. సైజు చేపపిల్లలు ఎండలకు చనిపోయే ప్రమాదం ఉంది

సొంతంగా కొనుగోలు..

ప్రభుత్వం జాప్యం చేయడంతో మత్స్యకార, గంగపుత్ర, బెస్త కుటుంబాలు అప్పులు చేసి ఆంధ్ర ప్రాంతం నుంచి చేపపిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో వేశారు. దిలావర్‌పూర్‌ మండలం లోలం గ్రామ గంగపుత్ర సంఘం సభ్యులు సుమారు రూ.50 వేలు ఖర్చు చేశారు. జిల్లాలో అనేక చెరువుల్లో ఇలా సొంత డబ్బులతోనే విడుదల చేశారు. అధికారులు త్వరగా పెద్ద సైజు చేపపిల్లలు వదలాలని, సొంతంగా ఖర్చు చేసిన సంఘాలకు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు.

త్వరలో వదులుతాం..

త్వరలోనే చేపపిల్లలు చెరువులు, కుంటల్లో విడుదల చేసేలా చర్యలు చేపట్టాం. ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రక్రియ ప్రారంభానికి కాంట్రాక్టర్లతో మాట్లాడాం. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాగానే ప్రక్రియ ప్రారంభించి అతి త్వరగా పంపిణీ పూర్తిచేస్తాం. మత్స్యకార సంఘాలు తొందరపడి చేపపిల్లలు కొనుగోలు చేయొద్దు.

– అవినాష్‌, ఇన్‌చార్జి డీఎఫ్‌వో, మత్స్యశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement