కడెం: ప్రస్తుత కాలంలో యోగా విద్య ఎంతో అవసరమని, యోగా విద్యను విద్యాసంస్థల్లో కేజీ టూ పీజీ వరకు పాఠ్యాంశంగా అమలు చేయాలని హిమాలయ సిద్దయోగి జ్ఞాననందగిరి మహారాజ్ అన్నారు. మండలంలోని నవబ్‌పేట్ సత్యం ట్రెడిషనల్ యోగాశ్రమంలో యోగి సత్యం అధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బ్రహ్మజ్ఞాన యోగా విద్యా సంకల్ప సమాలోచన వేదిక జాతీయ స్దాయి రౌండ్ టెబుల్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతీ పాఠశాల, కళాశాలలో తప్పనిసరి యోగా, ధాన్యం గురించి బోధించాలని తెలిపారు. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో యోగా, ధాన్యంతో ఎంతో ప్రశాంతత లభిస్తుందన్నారు. విద్యార్ది చెడు వ్యసనాలను ఆకర్షితులు కాకుండా, క్రమశిక్షణతో దేశ పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో యోగా విద్య అమలుపై పలువురు యోగా గురువులు, న్యాయవాదులు, మేధావులు సలహాలు, సూచనలు చేశారు. తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవలుగా భావిస్తానని, నేటి నుంచి త్రికరణ శుద్ధితో ధాన్యం చేస్తానని, పర్యావరణాన్ని పరిరక్షిస్తు, అన్ని మతాలు, కులాలను గౌరవిస్తానని బ్రహ్మజ్ఞాన భారత్ ప్రతిజ్ఞ చేశారు. ఇందులో డీసీసీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీశ్‌రెడ్డి, సీహెచ్.రాజేశ్, సత్యం ట్రెడిషనల్ ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.


