కర్రలో కొలువైన దుర్గమ్మ
భైంసా: నిర్మల్లో కొయ్యబొమ్మల నకాషీ కళా కారుల చేతుల్లో కర్ర ప్రాణం పోసుకుని దుర్గమ్మగా కొలువుదీరనుంది. కళా నైపుణ్యంతో చెక్కిన దుర్గమ్మ విగ్రహాన్ని కుభీర్ మండలంలోని సరిహద్దు గ్రామమైన పార్డి(కె)లో ఈ నవరాత్రుల్లో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కొయ్యతో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించి పూజించాలని గ్రామస్తులు మూడేళ్లుగా చర్చిస్తున్నారు. ఈసారి ఆ ఆలో చన కార్యరూపం దాల్చింది. కళాకారులకు ఈ బాధ్యత అప్పగించగా, వారు అద్భుత శిల్పంగా మలిచి తీర్చిదిద్దారు. అమ్మవారి రూపురేఖ లు, ఆభరణాలు, అలంకరణలను చెక్కిన తీరు వారి నైపుణ్యానికి అద్దంపడుతోంది. కొయ్యలో రూపుదిద్దుకున్న శిల్ప సౌందర్యం, నవరాత్రుల భక్తి ఈసారి దుర్గమ్మ ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి.
పాలజ్ కర్ర గణేశుడి స్ఫూర్తితో..
పార్డి(కె)కి సుమారు 10 కి.మీ దూరంలోని పాలజ్ గ్రామంలో కొలువైన కర్ర గణేశుడు ఈ ప్రయత్నానికి స్ఫూర్తిగా నిలిచాడు. అక్కడ ఎన్నో ఏళ్లుగా వినాయక చవితి సందర్భంగా కర్రతో తయారైన గణేశుడిని ప్రతిష్టించి పూజి స్తున్నారు. ఆ ప్రత్యేక విగ్రహాన్ని దర్శించుకోవడానికి ఏటా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అక్కడి కర్ర గణేశుడిని తీర్చిదిద్దిన నకాషీ కళాకారులే ఇప్పుడు దుర్గమ్మ విగ్రహాన్ని కూడా రూపొందించడం విశేషం.
తొమ్మిది రోజుల ప్రత్యేక పూజలు
నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మను ప్రతిష్టించి తొమ్మిది రోజులపాటు ప్రత్యే క పూజలు నిర్వహించనున్నారు. నవదుర్గ రూపాల్లో అమ్మవారిని కొలుస్తూ భక్తి కార్యక్రమాలు చేపట్టేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్డి(కె)తోపాటు చుట్టూపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.


