టీబీ రహిత జిల్లాకు కృషి | - | Sakshi
Sakshi News home page

టీబీ రహిత జిల్లాకు కృషి

Oct 9 2026 1:38 AM | Updated on Oct 9 2026 1:38 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: టీబీ రహిత భారత్‌ లక్ష్య సాధనలో భాగంగా టీబీ రహిత జిల్లాకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ రాథోడ్‌ రమేశ్‌ సూచించారు. జిల్లా కేంద్రంలో జోష్‌ టీమ్స్‌ ఆధ్వర్యంలో గురువారం అవగా హన కార్యక్రమం నిర్వహించారు. వ్యాధి లక్షణాలు, ప్రారంభంలోనే గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం, పూర్తిస్థాయి చికిత్స అందించడం వంటి అంశాలపై అవగాహన కల్పించా రు. ప్రజలు భాగస్వాములైతేనే టీబీ నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేందర్‌ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే ఆరో గ్య కేంద్రంలో ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీ పూర్తిగా నయమవుతుందని స్పష్టం చేశారు.

ప్రశంసా పత్రాలు..

2025లో ఒక్క టీబీ కేసు కూడా నమోదు కాని తల్వేద, రాసిమెట్ల, కొండకూరు, ఇటిక్యాల, సంఘంపేట్‌–చందారం గ్రామ పంచాయతీల సర్పంచులకు అడిషనల్‌ కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. టీబీ అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఎన్‌సీసీ విద్యార్థుల కు ప్రశంసాపత్రాలు అందించారు. ప్రోగ్రాం ఆఫీ సర్లు డాక్టర్‌ పవన్‌, డాక్టర్‌ సౌమ్య, డిప్యూటీ డీఈ ఎంవో బారె రవీందర్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ గణేశ్‌, డీపీవో రాంచందర్‌, ఎంపీడీఓలు, హెల్త్‌ స్టాఫ్‌, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement