కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బ్లాక్‌ డే నిరసన | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బ్లాక్‌ డే నిరసన

Oct 9 2026 1:38 AM | Updated on Oct 9 2026 1:38 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: ఓటర్ల సవరణ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ, ప్రజల ఓటు హక్కును పరిరక్షించాలనే డిమాండ్‌తో ఇండియా కూటమి, ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నిర్మల్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ‘బ్లాక్‌ డే’ నిరసన, నిరాహార దీక్ష నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ పిలుపు మేరకు, నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచడి శ్రీహరిరావు నాయకత్వంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందన్నారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనా మా చేయాలని డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ, ఇండి యా కూటమి ఎంపీలను అరెస్ట్‌ చేయడాన్ని ఖండించారు. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అ ప్పాల గణేశ్‌చక్రవర్తి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సోమ భీమ్‌రెడ్డి, నిర్మల్‌ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆకుల హరీశ్‌కుమార్‌, కౌన్సిలర్లు, స ర్పంచులు, మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement