పుష్కర పనులు పకడ్బందీగా చేయాలి | - | Sakshi
Sakshi News home page

పుష్కర పనులు పకడ్బందీగా చేయాలి

Oct 9 2026 1:38 AM | Updated on Oct 9 2026 1:38 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ● బాసర ఈవో కార్యాలయంలో సమీక్ష

బాసర: గోదావరి పుష్కరాల సందర్భంగా బాసరలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులు పకడ్బందీగా, గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ ఈవో కార్యాలయంలో పుష్కరాల పనుల నిర్వహణ, పురోగతిపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. పనుల వివరాలు శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. ప్రతీ అధికారి తమ పరిధిలోని పనులను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, విశాలమైన పార్కింగ్‌ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌కుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ సందీప్‌, హార్టికల్చర్‌ అధికారి రమణ, ఈవో అంజనాదేవి పాల్గొన్నారు.

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి..

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరిచి, విద్యా ప్రమాణాలను మరింత పెంచేలా ఉపాధ్యాయులు పనిచేయాలని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో విద్యాశాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో విద్యాబోధన, విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యం, వెనుకబడిన విద్యార్థుల కోసం చేపడుతున్న ప్రత్యేక బోధన, బోర్డు పరీక్షల సన్నద్ధత తదితర అంశాలపై సమీక్షించారు. ప్రతీ విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో ప్రగతి సాధించేలా బోధన కొనసాగించాలన్నారు. తరచూ పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులు, పోషకులతో మాట్లాడి కారణాలను తెలుసుకోవాలని సూచించారు. బోర్డు పరీక్షలకు విద్యార్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని తెలిపారు. పాఠశాలల్లో పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో డీఈవో భోజన్న, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement