న్యూస్‌రీల్
రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి ఉదయం కొందరు, సాయంత్రం మరికొందరు బోరుబావుల ద్వారా పంటలకు నీరందించాలి.
ఒకరి బోరు నడుస్తుంటే మరొకరు ఆపితే భూగర్భ జలాలను కూడా పొదుపు చేయవచ్చు.
వరి పొలాన్ని నాలుగు భాగాలుగా విభజించుకుని రోజుకు ఒక భాగానికి నీరందించాలి.
ప్రతీ మడికి వరుసగా తడి ఇవ్వాలి. మొదటి మడికి నీరు పెట్టి మిగతా మడులను నిర్లక్ష్యం చేయకూడదు.
పంటలకు నీటి తడులు పెట్టాక మోటార్లు ఆఫ్ చేయాలి. దీంతో నీరు వృథా కాకుండా ఉంటుంది.
పగటిపూట లైట్ల వినియోగం తగ్గించాలి.
ఉక్కపోత ఉన్నప్పుడు మాత్రమే ఫ్యాన్ వాడాలి.
టీవీని రిమోట్‌తో స్టాండ్‌బైలో ఉంచకుండా పూర్తిగా ఆపివేయాలి.
ఇళ్లలో వాడే కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లకు 5–స్టార్ రేటింగ్ ఉన్నవాటిని వినియోగించాలి.
ఏసీలను 24 నుంచి 28 డిగ్రీల మధ్య నడపాలి. 2 నుంచి 5 గంటల మధ్య టైమర్ సెట్ చేసుకోవడం మంచిది.
థర్మల్, సోలార్, విండ్ పవర్ వంటి ప్రత్యామ్నాయ వనరులు, ఎల్‌ఈడీ బల్బులను వినియోగిస్తే విద్యుత్తును గణనీయంగా పొదుపు చేయవచ్చు.
అడవి పందికి ఆపద
జిల్లాలో వన్యప్రాణుల వేట కలవరపెడుతోంది. అడవి పందులు, జింకలు, నెమళ్లు ఇతర అటవీ జంతువుల అక్రమ రవాణ రాకెట్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.
బాసర తాత్కాలిక ఠాణా భవనం పరిశీలన
బాసర: బాసర మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులకు మార్గం సుగమం చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్‌ను తాత్కాలిక భవనానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమేరకు తాత్కాలిక ఠాణా భవనాన్ని భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ బుధవారం పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ అధికారులు, ఎన్‌సీసీ ప్రతినిధులు, బాసర ఎస్‌హెచ్‌వో దీపక్‌తో కలిసి భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పెండింగ్‌లో ఉన్న పనులు, మౌలిక వసతులు, సాంకేతిక ఏర్పాట్ల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యుత్, నీటి సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వ్యవస్థతోపాటు కార్యాలయ నిర్వహణకు అవసరమైన అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి, అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే తరలింపు ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు.
కుంటాల: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇప్పటికే ఈవానాకాల వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. జిల్లా వ్యాప్తంగా 22 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మరోవైపు చెరువులు, కుంటలు నిండలేదు. ప్రస్తుతం పంటలు చివరి దశలో ఉండడంతో వానాకాలం పంటలను కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ మోటార్లపై ఆధారపడుతున్నారు. ఇక వేడి, ఉక్కపోత కారణంగా గృహ విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. దీంతో విద్యుత్ వినియోగం రోజురోజుకు అంచనాలకు మించి పెరుగుతోంది.
జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు ఇలా..
జిల్లాలో మొత్తం 3,67,539 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహాలు 2,48,392, వాణిజ్య కనెక్షన్లు 32,196, పరిశ్రమల కనెక్షన్లు 1,316, కుటీర పరిశ్రమలు 21, వ్యవసాయం 78,963 కనెక్షన్లు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో 50.949 మిలియన్ యూనిట్లు వినియోగించాల్సి ఉండగా, 86.48 మిలియన్ యూనిట్ల వినియోగించారు. అంచనాలకు మించి 35,531 మిలియన్ యూనిట్లు అధికంగా వినియోగించారు. గత జూన్ నుంచి ప్రతీ నెల వినియోగం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్తును పొదుపు చేస్తే మేలని అధికారులు సూచిస్తున్నారు.
గృహజ్యోతికి దూరం..
భానుడి భగభగలకు వేడి, ఉక్కపోత పెరుగుతోంది. దీంతో ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పగలు, రాత్రి తిరుగుతున్నాయి. దీంతో విద్యుత్ మీటర్లు గిరగిరా తిరుగుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో పేదలకు అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ దాటుతోంది. దీంతో చాలా మంది గృహ వినియోగదారులకు అక్టోబర్‌లో విద్యుత్ బిల్లులు వచ్చాయి.
పొదుపు పాటిస్తే మేలు..
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక విద్యుత్ రంగంపై భారం పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులు ఒక యూనిట్ విద్యుత్ నుపొదుపు చేస్తే, రెండు యూనిట్ల విద్యుత్‌ను తయారు చేసినట్లే. విద్యుత్ పొదుపు చేసి సహకరించాలి. – అల్జాపూర్ రమేశ్, ఎస్‌ఈ, నిర్మల్
విద్యుత్ సమాచారం..
గతేడాది ఈ ఏడాది విద్యుత్ వినియోగం
(మిలియన్ యూనిట్లలో)..
నెల 2025–26 2026–27 డిఫరెన్స్ ఏప్రిల్ 104.534 106.28 1.746
మే 50.358 58.58 8.222
జూన్ 42.136 51.14 9.004
జూలై 62.147 65.45 3.303
ఆగస్టు 65.003 74.96 9.957 సెప్టెంబర్ 50.949 86.48 35.531
మొత్తం 233.551 253.353 19.502
వ్యవసాయ విద్యుత్ పొదుపు మార్గాలు..
గృహ విద్యుత్ పొదుపు మార్గాలు..


