కళాకారుడికి రాష్ట్రస్థాయి పురస్కారం | - | Sakshi
Sakshi News home page

కళాకారుడికి రాష్ట్రస్థాయి పురస్కారం

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

నిర్మల్‌ఖిల్లా: ప్రముఖ కళాకారుడు, తెలంగాణ తల్లి రూపశిల్పి, వెంకటాద్రిపేటకు చెందిన బైరోజి వెంకటరమణాచారికి 2025 సంవత్సరానికి ప్రతిభా పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ పద్మశ్రీ ఎం.మురళీమోహన్‌ చేతుల మీదుగా వెంకటరమణాచారి పురస్కారంతోపాటు నగదు బహుమతిని అందుకున్నారు. జిల్లా కవులు, రచయితలు పత్తి శివప్రసాద్‌, నేరెళ్ల హనుమంతు, పోలీస్‌ భీమేష్‌, వెన్నెల రాజేందర్‌ తదితరులు వెంకటరమణాచారికి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement