నిర్మల్‌రూరల్: ప్రతీ పాఠశాలలో విద్యార్థులందరికీ సమాన విద్య అందేలా చూడాలని డీఈవో దర్శనం భోజన్న సూచించారు. జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సీఆర్పీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సీసీవో, కేజీబీవీ ఎస్‌వోలకు ‘ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇండక్షన్ ప్రోగ్రాం మంగళవారం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలలో ప్రతీ విద్యార్థిని కలుపుకొని పోవాలన్నారు. దివ్యాంగ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎంఈఓ పద్మ, జిల్లా విలీన విద్య సమన్వయకర్త ప్రవీణ్‌కుమార్, ఆర్పీ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.


