క్రిటికల్‌ వార్‌..! | - | Sakshi
Sakshi News home page

క్రిటికల్‌ వార్‌..!

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

● ఆస్పత్రి ప్రారంభంపై ఆందోళన ● పరిశీలించి, నిరసన తెలిపిన మాజీమంత్రి ● అభివృద్ధి నిరోధకుడంటూ ఎమ్మెల్యేపై ఆరోపణ ● సొంతపార్టీ మంత్రులపైనా విమర్శలు బుధవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

నిర్మల్‌

కవ్వాల్‌లో మళ్లీ సఫారీ

కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌లో నాలుగు నెలల విరామం తర్వాత మళ్లీ సఫారీ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

చట్టాలపై అవగాహన

పెంచుకోవాలి

నిర్మల్‌టౌన్‌/నిర్మల్‌చైన్‌గేట్‌: సీనియర్‌ సిటిజన్లు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జి ల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీని యర్‌ సివిల్‌ జడ్జి పి.రవీందర్‌ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ శాఖ, సైబర్‌ క్రైమ్‌ విభాగం సమన్వయంతో మంగళవారం జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్‌ భవన్‌లో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్‌ సిటిజన్స్‌, పెన్షనర్లకు న్యాయ సేవల చట్టం, సీనియర్‌ సిటిజన్స్‌ చట్టం, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, సైబర్‌ క్రైమ్‌ ఎస్సై శ్రావణి, సీనియర్‌ సిటిజన్లు, పెన్షనర్లు పాల్గొన్నారు.

నిర్మల్‌: ‘జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో 2023–24లో మంజూరైన క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రి నిర్మాణ పనులు ఆరు నెలల క్రితమే పూర్తయ్యాయి. కానీ ఇప్పటివరకు ప్రారంభించడం లేదు. స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అభివృద్ధి నిరోధకుడిగా మారి, కమిషన్ల కోసమే ఇలాంటి పనులను అడ్డుకుంటున్నాడు..’అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సొంతపార్టీ మంత్రులపైనా విమర్శలు చేశారు.

‘కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.23.75 కోట్ల నిధులతో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రిలో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఎక్విప్‌మెంట్‌ తీసుకురాలేదు. పైగా, రాష్ట్రంలో అధికారంలో లేని ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఆస్పత్రి ప్రారంభాన్ని ఎలా అడ్డుకుంటారో వారే చెప్పాలి. కాంగ్రెస్‌ నేతలు బురద రాజకీయాలు మానుకోవాలి..’ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌ రాథోడ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, అటు కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ నేతల మధ్య ‘క్రిటికల్‌ కేర్‌’ కేంద్రంగా పొలిటికల్‌ వార్‌ ముదిరింది.

అభివృద్ధి నిరోధక ఎమ్మెల్యే..

నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి అభివృద్ధి నిరోధకుడు అనే బిరుదు ఇవ్వాలని మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆరోపించారు. ఆస్పత్రి పరిశీలన అనంతరం మాట్లాడారు. జిల్లాలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ, మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ, హరిత హోటల్‌, మినీ ట్యాంక్‌బండ్‌ పనులతోపాటు క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రినీ స్థానిక ఎమ్మెల్యే అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. కమీషన్ల కోసమే అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని విమర్శించారు. సీఎం, మంత్రులను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ అక్రమార్జన చేస్తున్నాడని మండిపడ్డారు.

మంత్రులకు హెచ్చరిక..

రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావులు వారంలోగా ఆస్పత్రిని ప్రారంభించేలా చూడాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని సొంతపార్టీ మంత్రులనూ హెచ్చరించారు. ధర్మసాగర్‌ మినీట్యాంక్‌బండ్‌ పనులనూ అడ్డుకుంటున్నాడని మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ గణేశ్‌చక్రవర్తి ఆరోపించారు. తనకు ఎన్నికల్లో సహకరించిన కొంతమంది స్థానిక ప్రైవేటు వైద్యుల కోసమే క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రికి ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడని గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్‌ అర్జుమంద్‌అలీ విమర్శించారు. మాజీమంత్రి, నాయకులు జిల్లా ఆసుపత్రి నుంచి అంబేడ్కర్‌ చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆకుల హరీ ష్‌, డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, మున్సిపల్‌ కౌన్సిలర్లు, పాల్గొన్నారు.

నిర్మించారు.. నిర్వహణ మరిచారు!

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం సిగ్గుచేటు..

జిల్లా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించకుండా కాలయాపన చేస్తూ, ప్రజారోగ్యంతో రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం చెలగాటమాడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్‌ రాథోడ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీమంత్రి ఆస్పత్రి పరిశీలన, ఎమ్మెల్యేపై ఆరోపణల నేపథ్యంలో ఆయన మంగళవారం సాయంత్రం కౌంటర్‌ ప్రకటన చేశారు. కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో రూ.10 కోట్ల విలువ చేసే ఫర్నిచర్‌, అత్యవసర వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో సమకూర్చలేదన్నారు. పూర్తి ఎక్విప్‌మెంట్‌ లేకుండా ఆస్పత్రి ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ఆస్పత్రి ప్రారంభోత్సవ తేదీ నిర్ణయించడానికి ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వంలో లేరని, అధికారం, అధికార యంత్రాంగం మొత్తం కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతుల్లోనే ఉండగా, ఆయన ఆసుపత్రి ప్రారంభాన్ని ఎలా ఆపుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై బురద చల్లే రాజకీయాలు మానుకోవాలన్నారు.

మాజీమంత్రి పరిశీలన..

జిల్లా జనరల్‌ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మించిన 50 పడకల క్రిటికల్‌ కేర్‌(ట్రామా) సెంటర్‌ భవనాన్ని వెంటనే ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిని మంగళవారం సందర్శించిన ఆయన ప్రతీ రూమ్‌లోకి వెళ్లి ఏర్పాట్లు, వచ్చిన ఎక్విప్‌మెంట్లు పరిశీలించారు. జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గోపాల్‌సింగ్‌, టీజీఎంఐడీసీ ఏఈ శ్రీకాంత్‌ ద్వారా ఆస్పత్రి నిర్మాణం, పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement