సర్‌.. స్లో! | - | Sakshi
Sakshi News home page

సర్‌.. స్లో!

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

వాతావరణం ● నోటీసులకు స్పందించని ఓటర్లు ● పెరుగుతున్న పెండింగ్‌ కేసులు ● బీఎల్‌వోలపై పెరుగుతున్న ఒత్తిడి ● జిల్లాలో ప్రహసనంగా మారిన ప్రక్రియ

వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. రాత్రి మంచు కురుస్తుంది.

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో సర్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ స్లోగా సాగుతోంది. నోటీసులు జారీ అవుతున్నా విచారణ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. నోటీసులు అందుకున్నవారు నిర్దేశిత తేదీల్లో హియరింగ్‌కు హాజరు కావడం లేదు. కేటాయించిన తేదీలు గడిచిపోవడం, రీషెడ్యూల్‌ చేయాల్సి రావడం వంటి పరిణామాలతో పెండింగ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా అన్‌మ్యాపింగ్‌, అనామలీస్‌ ఓటర్లందరికీ నిర్ణీత గడువులోగా నోటీసులు జారీ చేసి హియరింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌ పదేపదే వీడియో కాన్ఫరెన్స్‌లో సూచిస్తున్నా జిల్లాలో ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

2.22 లక్షల మందికి నోటీసులు..

జిల్లాలో ఖానాపూర్‌, నిర్మల్‌, ముధోల్‌ నియోజకవర్గాల్లో మొత్తం 2,22,054 మందికి సర్‌ నోటీసులు జనరేట్‌ కాగా, 1,97,843 అందజేశారు. ఇంకా 24,211 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. హియరింగ్‌ తేదీల్లో గైర్హాజరు కావడంతో 63,180 నోటీసులు ల్యాప్స్‌ అయ్యాయి. నిర్దేశిత గడువులోగా ఎంతమంది విచారణకు హాజరవుతారు, ఎంతమంది గైర్హాజరవుతారనేది కీలకంగా మారింది.

హాజరు పెంచడమే కీలకం..

నోటీసులు జారీ చేయడంపైనే అధికార యంత్రాంగం దృష్టి సారిస్తోంది. నోటీసు అందుకున్న వారు నిర్ణీత తేదీన విచారణకు హాజరై తమ వాదనలు, ఆధారాలు సమర్పించినప్పుడే ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో హియరింగ్‌ తేదీ, సమయం, వేదికపై స్పష్టమైన సమాచారం అందించడం, గైర్హాజరైన వారికి వెంటనే తదుపరి తేదీ కేటాయించడం, పెండింగ్‌ కేసులపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. లేకపోతే ఒకే కేసుకు పదేపదే తేదీలు కేటాయించే పరిస్థితి ఏర్పడి పెండింగ్‌ తేదీలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

గైర్హాజరీలతో జాప్యం..

సర్‌ ప్రక్రియలో నోటీసులు జారీ చేసే సమయంలోనే సదరు వ్యక్తికి హియరింగ్‌ తేదీ ఇస్తున్నారు. ఆ తేదీన హాజరు కాకపోతే అది ల్యాప్స్‌ అవుతుంది. అదే అంశంపై మరోసారి తేదీ కేటాయించాల్సి వస్తోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఇలాంటి గైర్హాజరీలు పెరిగితే హియరింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో సర్‌ వివరాలు..

జిల్లాలో మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 930

జారీ చేయాల్సిన నోటీసులు 2,22,054

జనరేట్‌ చేసిన నోటీసులు 2,22,003

పంపిణీ చేసిన నోటీసులు 1,97,843

పంపిణీ చేయవలసిన నోటీసులు 24,211

హియరింగ్‌ పూర్తయినవారు 1,58,659

హియరింగ్‌ గడువు ముగిసినవారు 63,180

నియోజకవర్గం నోటీసులు జారీ అయినవి హియరింగ్‌కు స్పందించనివారు

పిలిచినవి

ఖానాపూర్‌ 68,090 67,307 46,447 21,595

నిర్మల్‌ 83,383 80,980 60,076 23,177

ముధోల్‌ 70,581 49,556 52,136 18,408

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement