నిర్మల్‌చైన్‌గేట్: హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి యువ టూరిజం క్లబ్(వైటీసీ) పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లా విద్యార్థులను కలెక్టర్ భవేష్ మిశ్రా మంగళవారం అభినందించారు. కళాశాలల విభాగంలో నిర్వహించిన నృత్య పోటీల్లో నిర్మల్ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థినులు (8 మంది) రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించారు. పాఠశాలల విభా గంలో ఖానాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థినులు తమ నటనతో ప్రోత్సాహక బహుమతిని గెలుచుకున్నారు. రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థులతోపాటు వారి శిక్షకులను కలెక్టర్ సన్మానించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. విజేతలైన విద్యార్థులకు త్వరలోనే నగదు బహుమతులను అందజేస్తామని ప్రకటించారు. ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ రాథోడ్ రమేశ్, డీఈవో భోజన్న, డీఐఈవో పరశురామ్, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, డీపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


