నిర్మల్‌టౌన్: స్వచ్ఛత, పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ ర విబాబు అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కా వాలని పిలుపునిచ్చారు.‘స్వచ్ఛతా హీ సేవ’ కా ర్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో మంగళవారం పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించా రు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న మాసోత్సవాల్లో భాగంగా బ్యాంకు ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా స్థానిక ధర్మసాగర్ పరిసర ప్రాంతాలతో పాటు బస్టాండ్ ఆవరణలో శుభ్రత కార్యక్రమం చేపట్టారు. వీధులు, ప్రజారవాణా కేంద్రాల వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం రామ్‌గోపాల్, టీజీబీ రీజినల్ మేనేజర్ నవీన్, పలువురు బ్యాంకింగ్ అధికారులు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


