నిర్మల్‌టౌన్: రెండేళ్ల 11 నెలలకే తన జ్ఞాపకశక్తితో అందరినీ అబ్బురపరుస్తున్న జివెన్ అల్లూరి మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. తెరపై రంగుల పేర్లను అత్యంత వేగంగా గుర్తించి చెప్పిన చిన్నారిగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. కేవలం 45 సెకన్లలో 20 రంగుల పేర్లను సరిగ్గా చెప్పి ఈ ఘనత సాధించాడు. జివెన్ తల్లిదండ్రులు నిర్మల్‌లో వైద్యసేవలు అందిస్తున్న న్యూరాలజిస్ట్ డాక్టర్ మనోజ్ భరత్, పిల్లల వైద్యురాలు డాక్టర్ దివ్య. వైద్య వత్తిలో కొనసాగుతున్న వీరు చిన్నారి ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తూ.. వచ్చారు. ఫలితంగా చిట్టి చేతులు.. చురుకై న మెదడు.. అద్భుతమైన జ్ఞాపకశక్తితో ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ తెచ్చుకున్నాడు.


