నిర్మల్‌చైన్‌గేట్: ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలని ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ రాథోడ్ రమేశ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో శుక్రవారం సమావేశం నిర్వహించా రు. సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేస్తూ, పంటల కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు. గతంలో క్షేత్రస్థాయిలో ఎదురైన అనుభవాల దష్ట్యా తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. కేంద్రాల వద్ద రైతులకు సదుపాయాలు కల్పించాలని తెలిపా రు. వ్యవసాయ అధికారులు మండలాల వారీగా వివరాలు సేకరించి, తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, వ్యవసాయ అధికారి సుజాత, తూనికలు, కొలతల అధికారి శంకర్, డీసీవో నర్సయ్య, అధికారులు పాల్గొన్నారు.


