నిర్మల్‌టౌన్: జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రతిష్టించిన గణేశ్ విగ్రహానికి ఎస్పీ జానకీషర్మిల శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభయాత్రను ప్రారంభించారు. శోభయాత్రలో ఎస్పీ పాల్గొ ని, నిమజ్జనానికి తరలించారు. ఇందులో పో లీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో వి కారాబాద్ అడిషనల్ ఎస్పీ రాజేశ్‌మీనా, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీని వాస్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


