నిర్మల్ రూరల్: ఫార్మర్ రిజిస్ట్రీతో రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయ అధికారి బి.సుజాత తెలిపా రు. మండలంలోని కౌట్ల(కే) గ్రామంలో రైతు రిజిస్ట్రీపై శుక్రవారం అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ అగ్రిస్టాక్ కార్యక్రమంలో భా గంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చే స్తున్న ఫా ర్మర్ రిజిస్ట్రీ విధానంలో ప్రతీ రైతుకు ప్రత్యేకమైన ఫార్మర్ ఐడీ అందించనున్నట్లు వివరించారు. రైతు రిజిస్ట్రేషన్‌తో భూమి వివరాలు ఒకే చోట నమోదు కావడంతోపాటు, నిజమై న రైతులకు పారదర్శకంగా ప్రభుత్వ పథకా లు అందే అవకాశం ఉంటుందన్నారు. ఎరువుల కొనుగోలు కోసం ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్, బ్యాంకుల ద్వారా రుణాలు, పీఎం కిసాన్, జాతీయ ఆహార భద్రత మిషన్, రాష్ట్ర వ్యవసాయ పథకాలు, సబ్సిడీలు తదితర రైతు సేవలకు ఫార్మర్ ఐడీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏవో వసంత్‌రావు, ఏఈవో అంబాజీ, సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ రఘు, న ర్సారెడ్డి, దేవేందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.


