చరిత్రను వక్రీకరించొద్దు | - | Sakshi
Sakshi News home page

చరిత్రను వక్రీకరించొద్దు

Sep 16 2026 4:31 AM | Updated on Sep 16 2026 4:31 AM

ఖానాపూర్‌: నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన మహత్తర పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో వేలాది మంది రైతులు, కూలీలు, పేదలు పాల్గొన్నారని సీపీఐ జి ల్లా కార్యదర్శి భూక్య రమేశ్‌ తెలిపారు. చరిత్ర వక్రీకరించి కమ్యూనిస్టుల పాత్రను కనుమరు గు చేయాలనే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొ ట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మంగళవారం ఖానాపూర్‌లోని కుమురం భీమ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. అనంతరం నిర్వహించిన ప్రదర్శనలో ఆ యన మాట్లాడారు. ఈ నెల 17న హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బ హిరంగ సభకు కార్మికులు, కర్షకులు, ప్రజలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ మండల కార్యదర్శి పిల్లి రమేశ్‌, ఏఐటీయూసీ అధ్యక్షుడు గంగ న్న, ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గోవింద్‌, స్వామి, నర్సయ్య, హన్మంత్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement