భైంసా: వర్షాభావంతో ఎండుముఖం పట్టిన పంట లకు రెండ్రోజులుగా కురిసిన వర్షాలు ఊరటని చ్చాయి. సోయా, వరి తదితర పంటలకు జీవం పో సినట్లయింది. కాగా, జిల్లాలో చెరువులు ఇంకా పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో సాగునీటి కోసం రైతుల ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం సోయా పంటకు కీలక దశ కావడంతో ఈ వర్షాలు మేలు చేశాయి. జిల్లాలో 803 చెరువులుండగా వీటిలో 678 నిండాయి. మరో 125 చెరువుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. వీటిపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, పుస్తెలు చెరువులోకి ఆశించిన స్థాయిలో నీరు చేరక ఆయకట్టు రైతులు అవస్థలు పడుతున్నారు. పంటలకు ప్రస్తుతం నీటి అవసరం పెరుగుతున్న నేపథ్యంలో చెరువు నిండితే తమ సాగునీటి సమస్య తీరుతుందని ఆశిస్తున్నారు.
జిల్లాలో 17.6 శాతం లోటు
జూన్ 1నుంచి సెప్టెంబర్ 15వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 829.1 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటివరకు 683.1 మిల్లీ మీటర్లుగా నమోదైంది. సాధారణంతో పోలిస్తే 146 మిల్లీ మీటర్లు తక్కువగా.. 17.6 శాతం లోటులో ఉంది. సెప్టెంబర్ 14న జిల్లా సగటున 6.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా చూస్తే కుభీర్‌లో అత్యధికంగా 42శాతం, తానూరులో 37శాతం, బాసరలో 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కుంటాలలో 27, ముధోల్, భైంసా, నర్సాపూర్(జి), సారంగపూర్‌లో 25శాతం వరకు లోటు ఉంది. లోకేశ్వరంలో 16, దిలావర్‌పూర్‌లో 17, నిర్మల్ రూరల్‌లో 23, సోన్‌లో 15, లక్ష్మణచాందలో 18, ఖానాపూర్‌లో 13, దస్తూరాబాద్‌లో 9శాతం లోటు ఏర్పడింది. మరోవైపు పెంబిలో 8శాతం, కడెం పెద్దూర్‌లో 5శాతం అధిక వర్షపాతం నమోదైంది. నిర్మల్ అర్బన్‌లో సాధారణ వర్షపాతం నమోదైంది. మామడ సాధారణానికి దగ్గరగా ఉంది. రెండు రోజుల వర్షాలతో పంటలకు తాత్కాలికంగా ఊరట లభించినా.. జిల్లాలో లోటు వర్షపాతం కొనసాగుతోంది. దీంతో జిల్లా రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
మండలాల వారీగా తాజా వర్షపాతం వివరాలు
మండలం సాధారణం నమోదు లోటు/అధికం
(మి.మీ.లలో) (శాతంలో)
కుభీర్ 829.1 477.3 42 లోటు
తానూరు 789.1 496.4 37 లోటు
బాసర 803.3 546.6 32 లోటు
ముధోల్ 813.9 616.1 24 లోటు
భైంసా 849.5 635.3 25 లోటు
కుంటాల 848.7 622.8 27 లోటు
నర్సాపూర్(జి) 824.6 617.9 25 లోటు
లోకేశ్వరం 773.9 646.2 16 లోటు
దిలావర్‌పూర్ 871.8 721.3 17 లోటు
సారంగపూర్ 845.5 630.2 25 లోటు
నిర్మల్ అర్బన్ 889.4 889.3 సాధారణం
నిర్మల్ రూరల్ 835.3 644.1 23 లోటు
సోన్ 823.6 700.1 15 లోటు
లక్ష్మణచాంద 797.1 654.9 18 లోటు
మామడ 761.4 753.6 1 లోటు
పెంబి 853.9 925.1 8 అధికం
ఖానాపూర్ 841.4 728.4 13 లోటు
కడెం పెద్దూర్ 868.3 914.0 5 అధికం
దస్తూరాబాద్ 832.8 759.4 9 లోటు


