న్యూస్‌రీల్
విచ్చలవిడిగా వెలుస్తున్న ల్యాబ్‌లు అర్హత లేకున్నా రక్త, మూత్ర పరీక్షలు ఫీజుల పేరిట నిర్వాహకుల దోపిడీ రెఫరీలకు కమీషన్లు ఇస్తున్న వైనం జబ్బుతో వెళ్లిన రోగుల జేబు ఖాళీ
ఏకదంతముపాస్మహే..
నవరాత్రోత్సవాల
నిర్వహణకు ఏర్పాట్లు
నిర్మల్‌టౌన్: శాంతియుత వాతావరణంలో గణే శ్ నవరాత్రోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. ని ర్మల్ రూరల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో మంగళవారం ముస్లిం పెద్దలతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఉత్సవాల సందర్భంగా తీ సుకోవాల్సిన భద్రతా చర్యలు, ప్రజల సహకా రం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో గణేశ్ న వరాత్రోత్సవాలు, నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించి ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని కోరా రు. అనంతరం ముస్లిం పెద్దలు తమ చిన్ననా టి అనుభవాలను ఎస్పీతో పంచుకున్నారు. గ తంలో గణేశ్ ఉత్సవాల్లో హిందువులతో కలిసి పాల్గొన్న సందర్భాలను గుర్తు చేసుకుంటూ మ త సామరస్యం, స్నేహభావం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు కృష్ణ, ప్రవీణ్, సమ్మయ్య పాల్గొన్నారు.
అనుమతి.. లేకుంటేనేమి?


