నిబంధనలకు వ్యతిరేకంగా.. | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు వ్యతిరేకంగా..

Sep 16 2026 4:31 AM | Updated on Sep 16 2026 4:31 AM

మెడికల్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలంటే నిబంధనల ప్రకారం నిర్ణీత అర్హతలున్న వైద్యులు తప్పనిసరిగా ఉండాలి. ప్రతీ ల్యాబ్‌ వైద్యుని పర్యవేక్షణలో నిర్వహించాల్సి ఉంటుంది. చిన్నపాటి ల్యాబ్‌ ఏర్పాటు చేయాలన్నా కనీసం ఎంబీబీఎస్‌ అర్హత గల వైద్యుడి పర్యవేక్షణ ఉండాలి. పెద్ద స్థాయిలో ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలంటే ఫాథాలోజిస్ట్‌, రేడియాలజిస్ట్‌, మైక్రోబయోలాజిస్ట్‌ తదితర అర్హత గల వైద్యులుండాలి. వీరికి సహాయకులుగా ల్యాబ్‌ టెక్నీషియన్లుండాలి. ల్యాబ్‌ నిర్వహణకు డిప్లొమా, డిగ్రీ కోర్సు పూర్తి చేసినవారు అర్హులు. కాగా, జిల్లాలో చాలాచోట్ల ప్రైవేట్‌ ఆస్పత్రులకు అనుబంధంగా మెడికల్‌ ల్యాబ్‌లు నిర్వహిస్తున్నా వాటిని సదరు ఆస్పత్రి వైద్యుడి పేరిట ఇతర వ్యక్తులే నడుపుతున్నారు. జిల్లాలో ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసినవారూ మెడికల్‌ ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement