ఇటు కాంగ్రెస్‌.. అటు బీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

ఇటు కాంగ్రెస్‌.. అటు బీఆర్‌ఎస్‌

Sep 8 2026 11:59 PM | Updated on Sep 8 2026 11:59 PM

నిర్మల్‌చైన్‌గేట్‌: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్య ల ను నిరసిస్తూ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, నిర్మల్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్‌ ఆదేశాల మేరకు మంగళవారం నిర్మల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుల హరీశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మలు దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని, నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్‌ అర్జుమన్‌ అలీ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌ చక్రవర్తి, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి, జిల్లా జనరల్‌ సెక్రెటరీ జూనెద్‌, నాయకులు పాల్గొన్నారు.

నిర్మల్‌టౌన్‌: అసెంబ్లీకి వస్తున్న మహిళా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం, వారిపై పోలీసులు చేయిచేసుకోవడం అప్రజాస్వామికమని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి అన్నారు. సోమవారం అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలను నిరసిస్తూ.. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి, అనంతరం రాస్తారో కో నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ప్రజా స్వామ్య పద్ధతిలో నిరసనలు, పోరాటాలు కొనసాగిస్తామని, కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాంకిషన్‌రెడ్డి, నాయకులు రామాదేవి, లోలం శ్యాంసుందర్‌, డాక్టర్‌ కిరణ్‌, గండ్రత్‌ రమేశ్‌, అయ్యన్నగారి రాజేందర్‌, శ్రీకాంత్‌ యాదవ్‌, జీవన్‌రెడ్డి, జీవన్‌రావు, మహేశ్‌రెడ్డి, భూషణ్‌రెడ్డి, దేవి శంకర్‌, నజీరుద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement