● టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్
నిర్మల్‌చైన్‌గేట్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి మరో రెండేళ్లు ఆగాల ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పడం సరికా దని, ఇప్పటికే రెండున్నరేళ్లు వేచి చూశామని.. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. ఈ నెల 10న తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ విజయవంతం చేయాలని నిర్మల్‌లోని ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సంఘ భవనంలో తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) సన్నాహక సమావేశం మంగళవా రం నిర్వహించారు. పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యోగ విరమణతో కోట్ల రూపాయల బెనిఫిట్స్ పొందుతున్నారనే ప్రచారాన్ని ఖండించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం చేపడుతున్న ‘చలో హైదరాబాద్’కు నిర్మల్ జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఓపెన్ డిగ్రీకి నేడే లాస్ట్
నిర్మల్‌టౌన్: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సుధాకర్, అంబేడ్కర్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ యు.గంగాధర్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరేందుకు అర్హత ఉన్న విద్యార్థులు బుధవారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చదువు మధ్యలో ఆపేసిన వారు, ఉద్యోగం చేస్తూ.. ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


