పఠనాసక్తి పెంపునకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

పఠనాసక్తి పెంపునకు చర్యలు

Aug 22 2026 2:17 AM | Updated on Aug 22 2026 2:17 AM

నిర్మల్‌ రూరల్‌: విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపు, అక్షరాస్యత, భాషా వికాసాన్ని పెంచడానికి రూమ్‌ టు రీడ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఇండి యా గెట్స్‌ రీడింగ్‌ క్యాంపెయిన్‌ 8.0–2026 నిర్వహిస్తున్నామని డీఈవో భోజన్న తెలిపారు. డీఈవో కార్యాలయంలో శుక్రవారం నా మాట లు – నా కథఅనే ఇతివృత్తాన్ని రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. చదవడం అనేది పిల్లల భాషా వికాసం, ఊహాశక్తి, విమర్శనాత్మ క ఆలోచన, ఆత్మవిశ్వాసం, స్వీయ వ్యక్తీకరణ కు తోడ్పడతాయని తెలిపారు. కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతం చేయాలని సూచించారు. జిల్లా క్వాలిటీ కోఆర్డి నేటర్‌ నర్సయ్య, కమ్యూనిటీ మొబలైజేషన్‌ కో ఆర్డినేటర్‌ ప్రవీణ్‌, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ కో ఆర్డినేటర్‌ లింబాద్రి, రూమ్‌ టు రీడ్‌ ఇండియా కోఆర్డినేటర్‌ విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement