శ్రావణమాసం పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. కనీసం 30 మంది ప్రయాణికులు ఒక బృందంగా ఉంటే వారి అభీష్టం మేరకు కోరుకున్న పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తాం. ఆసక్తి ఉన్న భక్తులు ముందుగానే నిర్మల్ బస్టాండ్‌లోని ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి. ప్రయాణికుల సంఖ్య, యాత్ర తేదీలు, గమ్యస్థానాల ఆధారంగా ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై చర్యలు తీసుకుంటాం. ఈ అవకాశాన్ని భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.
– పండరి, డిపో మేనేజర్, నిర్మల్


