మొరం తవ్వకాల అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

మొరం తవ్వకాల అడ్డగింత

Jul 12 2026 3:23 AM | Updated on Jul 12 2026 3:23 AM

భైంసాటౌన్‌: పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలో, మిర్జాపూర్‌ మార్గంలో గోశాలకు చెందిన భూముల్లో అక్రమంగా చేపడుతున్న మొరం తవ్వకాలను అడ్డుకోవాలని గోశాల నిర్వహణ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు శనివారం ఘటనాస్థలికి వెళ్లి మొరం తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ విషయమై స్థానిక రెవెన్యూ అధికారులకు కూడా సమాచారమిచ్చినట్లు పేర్కొన్నారు. మొరం అక్రమ తవ్వకాలపై తహసీల్దార్‌ శశిభూషణ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, సమాచారం తెలిసిన వెంటనే ఆర్‌ఐ రఘురాంను పంపినట్లు చెప్పారు. అయితే, అప్పటికే టిప్పర్‌, జేసీబీ వెళ్లిపోయినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement