‘గంగ..’ అన్న ఆయన పిలుపు పూర్తి కాకముందే ‘వస్తున్నా..’ అంటూ నవ్వుతూ ఇప్పటికీ తన భర్తకు ఏది అవసరమో ఆమె చేసి పెడుతోంది. పదోపాతికో కాదు.. 66 ఏళ్ల వారి బంధం ఇలా అన్యోన్యంగా సాగుతోంది. లోకేశ్వరం మండలం వట్టొలికి చెందిన రిటైర్డ్ టీచర్ రామొల్ల రాజారెడ్డి, గంగవ్వ దంపతులకు 80 ఏళ్ల వయసు దాటింది. వీరికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. ఓ కొడుకు డాక్టర్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ యశోదలో క్యాన్సర్ వైద్యనిపుణులు, మరో కొడుకు రాంరెడ్డి అక్కడే లాయర్. అన్ని బాధ్యతలనూ పూర్తిచేసిన ఈ జంట.. ఇప్పటికీ ఒకరికొకరు తోడుగా తమ దాంపత్య జీవనాన్ని ఆదర్శవంతంగా సాగిస్తున్నారు.


