కేటీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత క్యాంపులో ఉన్న ఖానాపూర్ బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్‌నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం కలిశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పలు రాజకీయ సమీకరణలపై చర్చించినట్లు తెలిసింది. అనంతరం మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్‌చేశారు.
ఆధారాలతో సంప్రదించాలి
నిర్మల్‌ఖిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు చిట్‌ఫండ్ కంపెనీలలో చిట్టీలు వేసి డబ్బులను తిరిగి పొందని ఖాతాదారులు తగిన ఆధారాలతో ఉమ్మడి జిల్లా చిట్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించాలని అసిస్టెంట్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్ సూచించారు. ఉమ్మడి జిల్లాలో పరిధిలోని కనకదుర్గ, అచల, భవితశ్రీ, అక్షర, శుభనందిని తదితర చిట్ ఫండ్స్‌లో చిట్టీలు వేసి నగదును పొందని ఖాతాదారులు రసీదుతో కూడిన ఆధారాలతో ఏడు రోజులలోపు రాతపూర్వక ఫిర్యాదులు చేయాలని తెలిపారు.


