పారదర్శక పాలన అందిస్తాం
నిర్మల్‌టౌన్: పారదర్శక పాలనతో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ అప్పాల కావ్య, గణేశ్‌చక్రవర్తి అన్నారు. పట్టణంలోని తమ సొంత వార్డులు 36, 37లో మంగళవారం పర్యటించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. భారీ మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు వారిని సన్మానించారు. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టణ అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. ప్రతీ వార్డుకు సమాన ప్రాధాన్యం ఇస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.


